కూలీల ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని కారు

10చూసినవారు
బి. కోడూరు మండలంలోని సగిలేరు స్కూల్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోరుమామిళ్ళ - మైదుకూరు రహదారిలో పనికి వెళ్ళి ఇంటికి వెళ్తున్నా కూలీల ఆటోను గుర్తు తెలియని కారు ఢీకొనడంతో ఆటోలోని కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు అమ్మవారిపేటకు చెందిన వారు అని తెలుస్తుంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్