బద్వేలులోని గాంధీనగర్ కు చెందిన రహముతున్నీసా (38) అనే వివాహిత మంగళవారం కడుపునొప్పిని తట్టుకోలేక ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త ఖాదర్‌వలి లారీ డ్రైవర్ గా కలకత్తా వెళ్లారు. ఇంట్లో కుమార్తె రుక్సానా, కుమారుడు మెహర్ బ్ బాషా ఉన్నారు. సోమవారం రాత్రి పిల్లలు నిద్రపోయిన తర్వాత రహముతున్నీసా ఈ ఘాతుకానికి పాల్పడింది. మంగళవారం ఉదయం పిల్లలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.