
చంద్రగిరి: అమ్మవారిని దర్శించుకున్న వాదీరాజా మఠ పీఠాధిపతి
కర్ణాటక, ఉడిపి వాదీరాజా మఠ పీఠాధిపతి విశ్వవల్లభతీర్థ స్వామీజీ మంగళవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న స్వామీజీకి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.



































