
చంద్రగిరి అభివృద్ధిపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే సమీక్ష
చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్‌తో గురువారం సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టులు, కొత్త అభివృద్ధి ప్రతిపాదనలపై సమీక్షించారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను కోరారు.


































