
చంద్రగిరి: బంగారు తిరుచ్చిపై పద్మావతి దేవి ఊరేగింపు
తిరుచానూరులో శుక్రవారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై, అభిషేకాలు, సాయంత్రం శోభాయమానమైన అలంకరణతో అమ్మవారు తిరువీధుల్లో విహరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు.




































