గేదెల వివాదం: కత్తిపోటుతో వ్యక్తికి తీవ్ర గాయాలు

1634చూసినవారు
గేదెల వివాదం: కత్తిపోటుతో వ్యక్తికి తీవ్ర గాయాలు
అన్నమయ్య జిల్లా, చిట్వేల్ మండలం, నాగవరం గ్రామంలో గేదెల వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ప్రసాద్ రాజు ఇంటి వద్దకు వచ్చిన పవన్ కుమార్ రెడ్డి, తన కడుగు నీళ్లు గేదెలు తాగాయని ఆరోపించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన ప్రసాద్ రాజు కత్తితో పవన్ కుమార్ రెడ్డిపై దాడి చేయడంతో, అతని పొట్టలో కత్తి దిగి పేగులు బయటకు వచ్చాయి. తీవ్రంగా గాయపడిన పవన్ కుమార్ రెడ్డిని తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్