మైలవరంలో రూరల్ సీఐ భాస్కర్ రెడ్డి, ఎస్సై డా. శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ జరిగింది. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధించారు. మోటార్ సైకిల్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, చిన్నపిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని ప్రజలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.