జమ్మలమడుగులోని తొర్రివేముల గ్రామంలో త్వరలోనే అభివృద్ధి పనులు మొదలు పెడతామని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మంగళవారం తెలిపారు. చిన్నకొమెర్ల బైపాస్ దగ్గర నుంచి తొర్రివేముల విద్యుత్ సబ్ స్టేషన్ వరకు రూ. 1.60 లక్షలతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని, రానున్న 100 రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఆయన ఉచిత పశు వైద్య శిబిరంలో మాట్లాడారు.