జిల్లా వైద్య అధికారి డాక్టర్ నాగరాజు గారు జనవరి 30, 2026న ముద్దనూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముద్దనూరు మండలంలో జరుగుతున్న వైద్య సేవల వివరాలను వైద్యాధికారి డాక్టర్ కరిష్మాను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్ర సిబ్బంది యొక్క ముఖ ఆధారిత హాజరును పరిశీలించి, ఎన్ సి డి, సీడీ, ఆర్.బి.ఎస్.కె, ఈ ఎచ్ ఆర్, యం. ఆర్ 1&,2 అభా ఐడి ఇమ్మ్యూనైజేషన్, మలేరియా, డెంగీ, చంద్రన చికిత్స 104 వంటి ప్రోగ్రామ్స్ అన్ని 100 శాతం పూర్తి చేయాలని, సిబ్బంది సరైన సమయ పాలన పాటించాలని సూచించారు. హాస్పిటల్ పరిసరాలను కూడా పరిశీలించారు.