జమ్మలమడుగు: అద్దె భవనంలో అంగన్వాడీ కేంద్రం

447చూసినవారు
జమ్మలమడుగులోని ఎస్సీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం అద్దె భవనంలోనే కొనసాగుతోంది. మున్సిపాలిటీకి చెందిన స్థలం అందుబాటులో ఉన్నా, కొత్త భవన నిర్మాణంపై అధికారులు దృష్టి సారించడం లేదని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలు ఇంకెన్నాళ్లు అద్దె భవనంలోనే చదువుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సందర్శించి వెళ్తున్నా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్