టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి మాట్లాడుతూ, 19 నెలల చంద్రబాబు పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపు రూ. 8 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. రూ. 3,780 కోట్లతో హంద్రీనీవా పనులు పూర్తి చేశారని, 190 రోజుల్లో 40 టీఎంసీల నీటిని తరలించి 6 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టును రూ. 3870 కోట్లతో పూర్తి చేశారని, ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.