జమ్మలమడుగులో వినియోగదారుల హక్కులను కాపాడే లక్ష్యంతో శనివారం తూనికలు, కొలతల శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వ్యాపార సముదాయాలు, కిరాణా దుకాణాలు, ఇతర షాపులను తూనికల కొలతల శాఖ అధికారి సీఐ పరమేశ్వర్ కుమార్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. తక్కువ కొలతలతో వినియోగదారులను మోసం చేసినా, నిబంధనలను ఉల్లంఘించినా వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.