మతసామరస్యానికి ప్రతీకగా దర్గా ఏ గఫారియా 106వ ఉరుసు

361చూసినవారు
మతసామరస్యానికి ప్రతీకగా దర్గా ఏ గఫారియా 106వ ఉరుసు
కమలాపురంలో ఏప్రిల్ 1 నుండి 4వ తేదీ వరకు జరగనున్న ఉరుసు ఉత్సవాల గోడపత్రాలను కన్వీనర్ ఇస్మాయిల్ హిందూ, క్రైస్తవులతో కలిసి శుక్రవారం విడుదల చేశారు. ఈ ఉత్సవాల్లో నాలుగు రోజుల పాటు నిత్యం అన్నదానం ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 3న నిర్వహించే ఎద్దుల బండలాగుడు పోటీల్లో విజేతలకు రూ. 50 వేలు, 30 వేలు, 20 వేలు, 10 వేలు చొప్పున బహుమతులు అందజేస్తారు. కులమతాలకు అతీతంగా అందరూ ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్