సోమవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు మీరిన 150 మందిపై కేసులు నమోదు చేసి, రూ. 37,215 జరిమానా విధించినట్లు కడప ఎస్పీ షెల్కే నచికేత్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో వెళ్లేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలని ఆయన స్పష్టం చేశారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.