31 నుంచి శ్రీ విజయదుర్గాదేవి 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు

298చూసినవారు
31 నుంచి శ్రీ విజయదుర్గాదేవి 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు
కడప నగరంలో శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారి 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 31వ తేదీ శనివారం నుండి ఫిబ్రవరి 4 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలలో నిత్యం అభిషేకాలు, చండీహోమం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 3న సాయంత్రం 4 గంటలకు 'శ్రీ విజయదుర్గామల్లికార్జునుల' కల్యాణం, రాత్రి 8.30 గంటలకు నగరోత్సవం జరగనుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికార్జున రావు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్