కడప జిల్లాలో ఆపరేషన్ మోబీ ట్రాక్ 8వ విడతలో పోలీసులు రూ. 70 లక్షల విలువైన 505 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ బుధవారం బాధితులకు ఈ ఫోన్లను అందజేశారు. ఇప్పటివరకు మొత్తం రూ. 11. 76 కోట్ల విలువైన 5877 ఫోన్లను రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. CEIR, IMEI ట్రాకింగ్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఫోన్లను గుర్తించారు. ఫోన్ పోయిన వెంటనే సిమ్ బ్లాక్ చేసి, 1930 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.