కడప పక్కీర్‌పల్లి యూపీహెచ్‌సీ వద్ద పల్స్ పోలియో కేంద్రాన్ని డా. సునీల్ కుమార్, అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర, డీఎంహెచ్‌ఓ రవిబాబు, డీఐఓ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. మొత్తం 2, 37, 527 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్న లక్ష్యంతో, సాయంత్రం 7 గంటల నాటికి 2, 21, 552 మందికి (93.27%) చుక్కలు వేసి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.