వైఎస్సార్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం, మార్చి నెలాఖరున పదవీ విరమణ పొందిన స్పెషల్ బ్రాంచ్ ఎస్.ఐలు ఆర్.మురళి మోహన్, ఎస్.కె నౌషాద్ అలీ బాషా, పులివెందుల ట్రాఫిక్ ఎస్.ఐ విష్ణునారాయణ, కమ్యూనికేషన్స్ విభాగం ఎస్.ఐ టి.శ్రీనివాస కుమార్ లను అదనపు ఎస్.పి(పరిపాలన) కె.ప్రకాష్ బాబు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందచేసి ఆత్మీయ వీడ్కోలు పలికారు. క్రమశిక్షణ, అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందడం అభినందనీయమని, పోలీస్ శాఖకు వారు అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు.