వైఎస్సార్ కడప జిల్లా, కడపలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డీన్ నాగరాజు, అడ్మిన్ ఆఫీసర్ మల్లికార్జున స్వామి, పదవీ విరమణ చేసిన ఆర్.ఐ.ఓ.ను మంగళవారం ఘనంగా అభినందించారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన మార్గదర్శకత్వం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడిందని, భవిష్యత్తులోనూ ఆయన సూచనలు అవసరమని తెలిపారు. పదవీ విరమణ తర్వాత ఆయన జీవితం ఆయురారోగ్యాలతో, సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు.