కడప నగరంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, సీపీఎం పార్టీ కడప నగర కార్యదర్శి రామమోహన్ మాట్లాడుతూ, నెట్వర్క్ హాస్పిటల్స్ కు ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, తద్వారా సామాన్య, పేద ప్రజలకు వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బకాయిలు చెల్లించకపోవడం వల్ల వైద్య సేవలు ఆగిపోయాయని, దీనివల్ల మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.