కడప రిమ్స్ ఆసుపత్రిలో బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సదరం సర్టిఫికెట్ మంజూరు కోసం రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా సదరం వింగ్ సూపరింటెండెంట్ సుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ వెంకటేశులు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు వలపన్ని, లంచం డబ్బు తీసుకుంటున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.