వైయస్సార్ కడప జిల్లాలో 2026-27 సంవత్సరానికి గాను తొలి విడతలో 569 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేసినట్లు డీఎంఎసి చైర్మన్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం అర్హులైన వారికి కార్డులు జారీ చేశామన్నారు. మిగిలిన పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి, తదుపరి సమావేశంలో మంజూరు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.