కడప నగరంలోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టళ్లను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడంలో, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, నిధులు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తనకు తెలపాలని ఆయన భరోసా ఇచ్చారు.