కడపలో ఘనంగా అల్లూరి వెంకటయ్య జయంతి

411చూసినవారు
కడపలో ఘనంగా అల్లూరి వెంకటయ్య జయంతి
రాజీవ్ కల్చరల్ క్లబ్‌లో గురువారం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో నాటక రథసారథి అల్లూరి వెంకటయ్య 89వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆచార్య మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ, వెంకటయ్య నాటకాన్ని ఊపిరిగా భావించి జిల్లాకు 28 నంది అవార్డులు తెచ్చారని, సవేరా ఆర్ట్స్ ద్వారా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారని కొనియాడారు. పలువురు సీనియర్ కళాకారులను ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్