కడపలో ASYF రాష్ట్ర అధ్యక్షుడు ఓబయ్య మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే భారత దేశ ప్రగతికి ప్రధాన కారణమని అన్నారు. విజయ నర్సింగ్ కాలేజీలో విద్యార్థులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ ప్రపంచ స్థాయి విద్యను అభ్యసించి దేశ పరిస్థితులను అధ్యయనం చేసి, భారతదేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించారని, ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14న జరిగే 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోరారు.