అంజాద్ భాషా హౌస్ అరెస్ట్.. ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

2471చూసినవారు
అంజాద్ భాషా హౌస్ అరెస్ట్.. ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
కడప నగరంలోని నాగరాజుపేటలో ఓ పత్రిక కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఆందోళనలో పాల్గొనకుండా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషాను ఆయన ఇంటి వద్దే ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. శాంతియుత నిరసనలను అణచివేయడం దారుణమని, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్