రాయలసీమలో తొలిసారిగా కడప రాజారెడ్డి స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-6
క్రికెట్ టోర్నమెంట్ ఈనెల 17 నుంచి 21 వరకు జరగనుంది. ఏసీఏ నేతలు కేసినేని చిన్ని, సతీష్ కృషితో కడపకు ఈ అవకాశం దక్కింది. ఈ టోర్నమెంట్‌లో 7 జట్లు పాల్గొంటాయి, మొత్తం 9 ఉత్కంఠభరిత మ్యాచ్‌లు ఆడతారు. మధ్యాహ్నం 4 గంటలకు, ఫ్లడ్‌లైట్ల వెలుగులో రాత్రి 5 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆటగాళ్లు, ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కడప చరిత్రలో ఇది ఒక ప్రతిష్టాత్మక ఘట్టమని, ఈ
క్రికెట్ పండుగతో కడపకు రాష్ట్రస్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు లభించనుందని భరత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.