కొండాపురంలోని డా. బి. ఆర్. అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీష్ మీడియం) మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మాధవిబుధవారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల ఫిబ్రవరి 19వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, మార్చి 1వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని ఆమె పేర్కొన్నారు.