కడప నగరంలోని 40వ డివిజన్ పోలేరమ్మ తల్లి తిరుణాల సందర్భంగా ఫిబ్రవరి 6, 7 తేదీలలో జరగనున్న కార్యక్రమాల నేపథ్యంలో గురువారం మేయర్ పాక సురేష్ కుమార్ ఆలయ పరిసరాలను పర్యటించారు. ఆలయ పరిసరాల్లోని ఆక్రమణలు, ప్లాస్టిక్ డంప్‌ను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బండలాగుడు పోటీల కోసం మైదానాన్ని చదును చేయాలని సూచించారు. వరద నీటి సమస్య పరిష్కారానికి రూ. 70 లక్షలతో కల్వర్టు నిర్మిస్తామని, సిమ్లా కళ్యాణ మండపం వద్ద డ్రైనేజీ పూడికలు తీయించాలని మేయర్ తెలిపారు.