ఏఎస్ఐ భార్య మృతి: ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఘన నివాళి

439చూసినవారు
ఏఎస్ఐ భార్య మృతి: ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఘన నివాళి
కలసపాడు మండలం లింగారెడ్డిపల్లె పంచాయతీ ముదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఏఎస్ఐ బైరెడ్డి సుబ్బారెడ్డి సతీమణి బైరెడ్డి విమలమ్మ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి వారి స్వగృహానికి వెళ్లి, పార్థివదేహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్