మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ శ్రేణుల దాడిని నిరసిస్తూ కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆదివారం వైసీపీ నేతలు నల్ల రిబ్బన్లతో ఆందోళన చేపట్టారు. మేయర్ సురేష్ బాబు, మసీమా బాబు, సోహెల్ అహ్మద్ పాల్గొని, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా లోకేష్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయని, ప్రశ్నించే గొంతులపై దాడులు హేయమని ధ్వజమెత్తారు. దాడులు ఆపకపోతే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.