అంబటి రాంబాబుపై దాడి: వైయస్సార్సీపి నేత వంకెల ఆగ్రహం

577చూసినవారు
అంబటి రాంబాబుపై దాడి: వైయస్సార్సీపి నేత వంకెల ఆగ్రహం
గుంటూరు శివారులోని గోరంట్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని వైయస్సార్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వంకెల పెద్ద పోలిరెడ్డి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పాలన తుగ్లక్ పాలనతో పోలుస్తూ, వైయస్ జగన్, టీటీడీపై చేసిన అసత్య ఆరోపణలకు దిక్కుతోచని స్థితిలో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దేవదేవుడి ప్రసాదంలో కల్తీ ఆరోపణలు పచ్చి అబద్ధాలని, ఎన్డీఆర్ఐ, సుప్రీంకోర్టు తేల్చి చెప్పినా మళ్లీ అవే ఆరోపణలతో ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ జగన్, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలతో ప్లెక్సీలు పెట్టి, అభ్యంతరం తెలిపిన వైయస్సార్సీపి నాయకులపై, వారి ఇళ్లపై దాడులు చేయడం హత్యాయత్నమని, పోలీసుల చర్యలు హేయమని అన్నారు. చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ, ఈ పాలన కొనసాగితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్