బద్వేల్ లోని శివానగర్ లో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శ్రీ నరసింహరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతు పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పెన్షన్లను ఆయన స్వయంగా అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పెన్షన్లు లబ్ధిదారుల జీవనోపాధికి ఎంతో దోహదపడుతున్నాయని కమీషనర్ తెలిపారు. ఈ కార్యక్రమం పురపాలక కార్యాలయం, బద్వేల్ లో జరిగింది.