హాస్టళ్లలో విద్యార్థి సంఘాల ప్రవేశ నిషేధం: జీవో రద్దు చేయాలని డిమాండ్

7చూసినవారు
హాస్టళ్లలో విద్యార్థి సంఘాల ప్రవేశ నిషేధం: జీవో రద్దు చేయాలని డిమాండ్
కడపలో బుధవారం జరిగిన సమావేశంలో ASYF రాష్ట్ర అధ్యక్షులు ఓబయ్య మాట్లాడుతూ, సంక్షేమ హాస్టళ్లలో నాసిరకం ఆహారం, తాగునీటి కొరత, మరుగుదొడ్ల సమస్యలు, వసతి, భద్రత వంటి అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలను ప్రశ్నించే విద్యార్థి సంఘాల గొంతును నొక్కివేయడానికే ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాయడం తగదని, వెంటనే ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక జీవోను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు ఇంతియాజ్, పద్మతేజ, మాలిక్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్