కడప విశ్వనాధపురం రైల్వే అండర్ బ్రిడ్జి పనులు రెండేళ్లుగా నిలిచిపోవడంతో, దాని పూర్తికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సాధన కమిటీ ఆధ్వర్యంలో శనివారం భిక్షాటన చేశారు. ఐకాన్ విల్లా నుంచి ఎర్రముక్కపల్లి వరకు జరిగిన ఈ నిరసనలో, 50 వేల మందికి ఉపయోగపడే ఈ బ్రిడ్జి పనులు వెంటనే చేపట్టాలని కన్వీనర్ రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నిధులు విడుదల చేసి పనులు చేపట్టకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.