ఏ. ఐ. బి. ఎస్. యూ ఆధ్వర్యంలో కువైట్‌లో ఘనంగా రక్తదాన శిబిరం

493చూసినవారు
ఏ. ఐ. బి. ఎస్. యూ ఆధ్వర్యంలో కువైట్‌లో ఘనంగా రక్తదాన శిబిరం
కువైట్‌లో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి ప్రమిత త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేయడం గొప్ప సేవ అని రాయబారి పేర్కొన్నారు. ఉపాధి కోసం వచ్చే వారు గుర్తింపు పొందిన ఏజెంట్ల ద్వారానే రావాలని, కువైట్‌లో ఇబ్బందులు ఎదురైతే వెంటనే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్