ఏప్రిల్ 26వ తేదీన కడపలో జరగనున్న బ్రాహ్మణ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని బ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకులు జి.వి. శివరావు, గోపినాథ్, డాక్టర్లు బుధవారం ఆవిష్కరించారు. కడపలోని డాక్టర్ గోపినాథ్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమ్మేళనం విజయవంతం కావాలని, బ్రాహ్మణుల సమస్యలు చర్చకు రావాలని శివరావు, గోపినాథ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరసింహ బట్టర్, జగదీశ్, శ్రీనివాస్ రావు కూడా పాల్గొన్నారు.