అరుదైన రికార్డ్ సృష్టించిన అన్నదమ్ములు

7చూసినవారు
అరుదైన రికార్డ్ సృష్టించిన అన్నదమ్ములు
కడప జిల్లాకు చెందిన నంద్యాల సోదరులు అరుదైన రికార్డులను తమ సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక వయసు కలిగిన ఎమ్మెల్యేగా నంద్యాల వరదరాజులరెడ్డి గుర్తింపు పొందగా అదే కుటుంబానికి చెందిన ఆయన సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై, అత్యధిక వయసు కలిగిన మున్సిపల్ ఛైర్మన్‌గా రికార్డు సృష్టించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఇలా రెండు వేర్వేరు పదవుల్లో వయసు పరంగా అత్యున్నత స్థానాల్లో నిలవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్