ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలో బస్ షెల్టర్ లేక భక్తులు, యాత్రికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, తక్షణమే షెల్టర్ ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా నేత జి. శివకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం 5 రోడ్ల కూడలిలో గొడుగులతో వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు విస్తరణలో తొలగించిన బస్ షెల్టర్‌ను అధికారులు వెంటనే నిర్మించకపోతే, భిక్షాటనతో తామే ఏర్పాటు చేస్తామని ఆయన హెచ్చరించారు.