కేసీ కెనాల్ వద్ద ప్రమాదకరంగా చిన్నారుల ఆటలు

1885చూసినవారు
కేసీ కెనాల్ వద్ద ప్రమాదకరంగా చిన్నారుల ఆటలు
కడప ఆగాడి సమీపంలోని కేసీ కెనాల్ గట్టు వద్ద చిన్నారులు బురద మడుగుల్లో ప్రమాదకరంగా ఆడుకుంటున్నారు. గత నెల గుర్రాలగడ్డ బుగ్గవంక ఫ్లైఓవర్ వద్ద మడుగులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన మరువకముందే ఇలా జరగడం ఆందోళన కలిగిస్తోంది. కెనాల్ వద్ద ప్రహరీ గోడ, ఫెన్సింగ్ లేకపోవడంతోనే ముప్పు పొంచి ఉందని, అధికారులు తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్