వైఎస్సార్ కడప జిల్లా, చింతకొమ్మ దిన్నె పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గలవారికి శుక్రవారం సీఐ బాల మద్దిలేటి కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ కౌన్సిలింగ్ జరిగింది. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సీఐ సూచించారు.