కడప ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం చిన్నచౌక్ సీఐ ఓబులేసు ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీటు బెల్టు తప్పనిసరి అని స్పష్టం చేశారు. మైనర్లు వాహనాలు నడిపినా, సైలెన్సర్లు మార్చి శబ్ద కాలుష్యం చేసినా వాహనాలు సీజ్ చేస్తామని సీఐ హెచ్చరించారు. మద్యం తాగి, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజరాజేశ్వర రెడ్డి పాల్గొన్నారు.