కడప ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి 45 మంది లబ్ధిదారులకు రూ. 22 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలతో వైద్య ఖర్చుల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు ఆమె స్వయంగా ఈ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పడుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.