కడప నగరంలోని 2వ డివిజన్ ఉక్కాయపల్లిలో బుధవారం 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మాధవి చేపట్టారు. లబ్ధిదారుల ముంగిటకు పింఛను అందించే కార్యక్రమంలో భాగంగా ఆమె స్వయంగా ఇళ్లకు వెళ్లి నగదు అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని, ప్రజల సంక్షేమమే చంద్రబాబు నాయుడు ఉద్దేశం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.