కడప మున్సిపల్ కమిషనర్ రాకేష్ చంద్ర శనివారం ఎన్జీవో కాలనీలో పర్యటించి, ప్రజల తాగునీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌తో కలిసి టీడ్కో ఇళ్లను పరిశీలించారు. కలెక్టర్ సూచనల మేరకు పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు.