కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం వెంటనే ప్రారంభించాలి.. జగన్ రాథోడ్

10చూసినవారు
కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం వెంటనే ప్రారంభించాలి.. జగన్ రాథోడ్
రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన కడప ఉక్కు పరిశ్రమను వెంటనే నిర్మించాలని AIBSU రాష్ట్ర అధ్యక్షులు జగన్ రాథోడ్ డిమాండ్ చేశారు. వైఎస్సార్‌ కడప జిల్లాలోని కడప ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో విద్యార్థులతో కలిసి గురువారం ధర్నా నిర్వహించారు. శంకుస్థాపనలతో ప్రజలను మోసం చేయడం మానుకుని నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఉక్కు పరిశ్రమపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధికి ఉక్కు పరిశ్రమ కీలకమని, హామీలు అమలు కాకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్