రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్: నేరాలకు స్వస్తి చెప్పాలని డీఎస్పీ సూచన

1441చూసినవారు
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్: నేరాలకు స్వస్తి చెప్పాలని డీఎస్పీ సూచన
వైఎస్సార్‌ కడప జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గలవారికి శుక్రవారం సాయంత్రం డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి, సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్