బద్వేల్ అభివృద్ధిపై సీపీఐ పోరుబాట: 130 కోట్ల నిధులపై విచారణకు డిమాండ్

488చూసినవారు
బద్వేల్ అభివృద్ధిపై సీపీఐ పోరుబాట: 130 కోట్ల నిధులపై విచారణకు డిమాండ్
బద్వేల్ పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పోరాటాలకు సిద్ధమవుతోందని జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో విడుదలైన 130 కోట్ల నిధులను రాజకీయ పలుకుబడి ఉన్నవారి ఇళ్ల వద్ద, వెంచర్ల వద్ద రోడ్లు వేసి దుర్వినియోగం చేశారని, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ అభివృద్ధికి ఆటంకంగా మారారని ఆయన ఆరోపించారు. నేడు ఖర్చు పెడుతున్న 39 కోట్లను పేదల కాలనీల్లో డ్రైనేజీకి వాడాలని, లేనిపక్షంలో వీధి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. 130 కోట్ల నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని, లేదంటే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీపీఐ నాయకులు తెలిపారు. కూటమి ప్రభుత్వం నిధులు రాబట్టడంలో విఫలమవుతోందని, ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఆధిపత్య పోరుకు ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్