కడప జిల్లాలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పూర్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. కడప-బెంగళూరు రైల్వే లైన్ పూర్తికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని, రాయలసీమ నడిబొడ్డున ఉన్న కడప జిల్లాకు గత అనేక సంవత్సరాలుగా రైల్వే బడ్జెట్ లో నిధుల కేటాయింపులు లేవని ఆయన అన్నారు. ఫిబ్రవరి 11 నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు ఇవ్వాలని, లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.