కడప జిల్లా పరిషత్ లో శనివారం జరిగిన ఉమ్మడి జిల్లా సర్వసభ్య సమావేశంలో గ్రామీణ సమస్యలపై సభ్యులు అధికారుల దృష్టికి తెచ్చారు. అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను నిలదీశారు. కడప జడ్పీ ఛైర్మన్ ముత్యాల రామగోవిందు రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.